Chaitanya Rao: హీరోయిన్ ను ఫాలో అవుతున్న హీరో .. 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' ఫస్టు పోస్టర్ రిలీజ్!

Annapurna Photo Studio First Look Poster Released
షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల జోరు మరింత పెరిగింది. చిన్న సినిమాల విషయంలో కొత్త ప్రయోగాలు చేయడానికి సాధ్యమవుతూ ఉండటంతో, పెద్ద బ్యానర్లు సైతం, కేవలం చిన్న సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మరో బ్యానర్ ను ఏర్పాటు చేస్తున్నారు. టాలెంట్ ఉన్న యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. 

అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న మరో చిన్న సినిమానే 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'. చైతన్యరావు - లావణ్య లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా నుంచి దగ్గుబాటి సురేశ్ చేతుల మీదుగా ఫస్టు లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయించారు.  పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. 

సైకిల్ ను నడిపించుకుంటూ వెళుతున్న యువతిని, స్కూటర్ పై హీరో ఫాలో అవుతున్నాడు. అక్కడి పరిసరాలను బట్టి ఈ కథ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుందనీ, పాత కాలంనాటి సైకిల్ .. స్కూటర్ ను చూస్తుంటే ఇది 1980 లలో నడిచే కథ కావొచ్చని అనిపిస్తోంది. యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమాకి, చందు ముద్దు దర్శకత్వం వహించాడు.
Go Back to Shorts
Chaitanya Rao
Lavanya Laakshmi
Annapurna Photo Studio Movie

More Telugu News