అమాయకత్వం వల్ల అవకాశాలు పోగొట్టుకున్నాను: సీనియర్ నటి యమున

yamuna Interview
  • నటిగా మంచి పేరు తెచ్చుకున్న యమున 
  • తొలి సినిమాతోనే స్టార్ డమ్ వచ్చిందని వెల్లడి 
  • డేట్స్ సర్దుబాటు చేయడం రాలేదన్న యమున
  • అందువల్లనే కొన్ని సినిమాలు చేయలేకపోయానని వ్యాఖ్య
టాలీవుడ్ లో నిన్నటితరం కథానాయికల జాబితాలో యమున పేరు తప్పకుండా కనిపిస్తుంది. ఒకానొక సమయంలో ఒక వైపున సినిమాలు .. మరో వైపున సీరియల్స్ తో ఆమె కెరియర్ చాలా బిజీగా గడిచింది. అలాంటి యమున తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

'మౌనపోరాటం' సినిమా హిట్ తరువాత నాకు పెద్ద హీరోల సినిమాల నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ మేనేజర్ ను పెట్టుకోవాలనీ .. డేట్లు సర్దుబాటు చేసుకుంటూ ఉండాలనే విషయం నాకు తెలియదు. ఒకసారి ఒకరికి కొన్ని డేట్స్ ఇస్తే, ఆ డేట్స్ మళ్లీ వేరేవారికి ఇచ్చేదానిని కాదు. అలా చేయడం వలన చాలా అవకాశాలు పోయాయి" అన్నారు. 

"నా అమాయకత్వం వలన అప్పట్లోనే సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారి బ్యానర్లో చేయవలసిన మూడు సినిమాలను వదులుకున్నాను. చిరంజీవిగారితో కలిసి 'శ్రీమంజునాథ' సినిమాలో ఒక పాటలో కనిపిస్తాను. ఆ సంతోషం .. సంతృప్తి చాలు నాకు. అటు బాలచందర్ గారి స్కూల్ .. ఇటు దాసరి గారి స్కూల్ ప్రభావం కెరియర్ పరంగా ఎదగడానికి ఎంతో తోడ్పడింది" అంటూ చెప్పుకొచ్చారు. 
Advertisement
Yamuna
Actress
Tollywood

More Telugu News