జగన్ ను, కాపు నాయకులను తిట్టడమే పవన్ పని: పేర్ని నాని
- చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టారన్న పేర్ని నాని
- జనసైనికులంతా చంద్రబాబుకు ఓటు వేయాలని చెపుతారని ఎద్దేవా
- కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాలనుకుంటున్నారని విమర్శ
ముఖ్యమంత్రి జగన్ ను, కాపు నాయకులను తిట్టడమే పవన్ పని అని... ఈరోజు మచిలీపట్నంలో జరగబోయే జనసేన సభలో కూడా పవన్ ఇదే పని చేస్తారని చెప్పారు. ఇప్పటం సభకు, మచిలీపట్నం సభకు పెద్ద తేడా ఉండదని అన్నారు. కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టాలని పవన్ తాపత్రయపడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ ఎప్పటికీ మారడని అన్నారు. ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.