మద్యం మత్తులో పెండ్లిపీటలపైనే పడుకున్న వరుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు! వీడియో ఇదిగో!
- అసోంలోని నల్ బరీలో ఈ నెల 7న ఘటన
- పోలీసులకు ఫిర్యాదు చేసిన వధువు ఫ్యామిలీ
- ఏర్పాట్లకు అయిన ఖర్చును ఇప్పించాలని డిమాండ్
నల్ బరీకి చెందిన ప్రసేన్ జిత్ హలోయ్ అనే యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. వివాహం గ్రాండ్ గా జరిపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే, ప్రసేన్ తో పాటు ఆయన తండ్రి, ఇతర బంధువులు ఫూటుగా మద్యం సేవించడంతో ఈ కార్యక్రమం కాస్తా రసాభాసాగా మారింది. పెండ్లిపీటలపైన కూర్చోలేక వరుడు అక్కడే పడుకుండిపోయాడు. మద్యం మత్తులో తూగుతున్న వరుడి బంధువుల పరిస్థితి చూసి పెళ్లికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. ఆపై పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు. ఈ నెల 7న నల్ బరీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.