పెనుగంచిప్రోలులో అంతుచిక్కని వ్యాధితో 1000కిపైగా వరాహాల మృతి!
- మునేరు వైపు మేతకు వెళ్లి తిరిగిరాని పందులు
- ఎక్కడ పడితే అక్కడ పడి చనిపోతున్న వైనం
- పెంపకందారులకు లక్షల్లో నష్టం
పందుల మరణం కారణంగా ఒక్కొక్కరు లక్షల్లో నష్టపోయినట్టు చెబుతున్నారు. వాటికి మందులిచ్చినా ఫలితం లేకుండా పోయిందని, దీంతో అధికారులకు సమాచారం అందించినట్టు పెంపకందారులు చెప్పారు. చనిపోయిన పందుల నుంచి నమూనాలు సేకరించేందుకు ప్రయత్నించినా అవి కుళ్లిపోవడంతో సాధ్యం కాలేదని పశువైద్యులు పేర్కొన్నారు. వాటికి పెట్టే ఆహారం, నీళ్లు మార్చాలని పెంపకందారులకు సూచించినట్టు చెప్పారు.