రేపు కవితను విచారించనున్న ఈడీ... ఢిల్లీ బయల్దేరిన కేటీఆర్
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత
- విచారణ నోటీసులు పంపిన ఈడీ
- కవితను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు ప్రచారం
- కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడిన వైనం
లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 9న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు పంపడం తెలిసిందే. అయితే తనకు ఈ నెల 9, 10వ తేదీల్లో కూడా తీరిక లేదని, 11వ తేదీన విచారణకు వస్తానని కవిత ఈడీకి బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె రేపు (మార్చి 11) ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.