'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ ఖర్చుతో 8 సినిమాలు తీసి ముఖాన కొడతాం: తమ్మారెడ్డి
- ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.600 కోట్లు ఖర్చు చేశారన్న తమ్మారెడ్డి
- మంచి సినిమానే తీశారని కితాబు
- ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని వెల్లడి
- సమాజం కోసం కూడా సినిమాలు తీయాలని హితవు
ఇప్పటి రోజుల్లో వస్తున్న సినిమాలు సమాజం కోసం తీస్తున్న సినిమాలు కాదని, మన సంతృప్తి కోసమే మనం సినిమాలు తీసుకుంటున్నామని విమర్శించారు. అప్పుడప్పుడు సమాజానికి ఉపయోగపడే సినిమాలు కూడా తీయాలని, సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వగల అవకాశం ఫిలింమేకర్స్ కు ఉంటుందని అన్నారు.