Team India: వెంటవెంటనే రెండు వికెట్లు తీసి ఆసీస్ స్పీడుకు బ్రేక్ వేసిన భారత్

 Mohammed Shami clears Marnus Labuschagne
షార్ట్స్‌లో చూడండి
ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైన నాలుగో, చివరి టెస్టులో భారత బౌలర్లు నెమ్మదిగా రేసులోకి వస్తున్నారు. వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టి దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా జోరుకు బ్రేకులు వేస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (32), ఉస్మాన్ ఖవాజా మంచి ఆరంభం ఇచ్చారు.  

16వ ఓవర్లో జడేజా క్యాచ్ ద్వారా ట్రావిస్ హెడ్ ను ఔట్ చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీసి భారత్ కు తొలి బ్రేక్ అందించాడు. అనంతరం 23వ ఓవర్లో మమ్మద్ షమీ.. మార్నస్ లబుషేన్ (3)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ డీలా పడింది. ప్రస్తుతం ఆసీస్ 73/2 స్కోరుతో ఆడుతుండగా.. ఉస్మాన్ ఖవాజా (26)కు తోడు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (1) క్రీజులో ఉన్నాడు.
Go Back to Shorts
Team India
Australia
4th test
shami
Ravichandran Ashwin

More Telugu News