ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో అరెస్ట్

ED Arrests Arun Pillai in Delhi Liquor Scam
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పది మంది అరెస్టు కాగా తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైని సోమవారం విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. రాత్రి పదకొండు గంటలకు ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 11 కు చేరింది. త్వరలో ఇంకొందరిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం.

లిక్కర్ స్కామ్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే! సోమవారంతో కస్టడీ ముగియగా అధికారులు సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. పోలీసులు సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు, మనీలాండరింగ్ కేసును సవాల్ చేస్తూ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.
Go Back to Shorts
Delhi Liquor Scam
Ramachandra pillai
Enforcement Directorate
another arrest
sisodia

More Telugu News