సిసోడియాకు సీబీఐ కస్టడీని పొడిగించిన కోర్టు.. బెయిల్ విషయంలో కూడా నిరాశే!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టులో నిరాశ ఎదురైంది. సిసోడియా సీబీఐ కస్టడీని మరో రెండు రోజుల పాటు కోర్టు పొడిగించింది. సిసోడియా కస్టడీ ముగియడంతో ఆయనను ఈరోజు కోర్టులో సీబీఐ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. విచారణకు సిసోడియా సహకరించలేదని... ఆయనను మరో మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టును సీబీఐ కోరింది. 

సీబీఐ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు మూడు రోజులు కాకుండా మరో రెండు రోజులు కస్టడీని పొడిగించింది. మరోవైపు బెయిల్ విషయంలో కూడా సిసోడియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ను ఈ నెల 10న విచారిస్తామని కోర్టు తెలిపింది.  

Manish Sisodia
AAP
CBI
Custody
Bail
Delhi Liquor Scam

More Telugu News