బెడిసి కొట్టిన మేకప్.. వధువు ముఖం చూసి పెళ్లి రద్దు చేసుకున్న వరుడు
- కర్ణాటకలో ఓ బ్యూటీ పార్లర్ నిర్వాకంతో ఆసుపత్రిపాలైన యువతి
- మేకప్ ఫౌండేషన్ తర్వాత స్టీమ్ పట్టడంతో వాచిపోయిన ముఖం
- బ్యూటీ పార్లర్ పై పోలీసులుకు ఫిర్యాదు చేసిన యువతి కుటుంబం
హసన్ జిల్లాకు చెందిన ఓ యువతి పెళ్లి వేడుకలో అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. మేకప్ లో భాగంగా ఫౌండేషన్ తర్వాత ఆవిరి పట్టారు. బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్టీమ్ ఎక్కువై ఆ వేడికి యువతి ముఖమంతా వాచిపోయి అందవికారంగా తయారయ్యింది. ముఖమంతా నల్లగా మారింది. కళ్లు, బుగ్గలు వాచిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బ్యూటీ పార్లర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యూటీ పార్లర్ యజమానికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు.