Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్

US President Biden had skin cancer removed doctor says no more treatment needed
Advertisement
  • చర్మ క్యాన్సర్ తో బాధపడిన అగ్రరాజ్యం అధినేత
  • ఛాతిపై చివరి కణతిని తొలగించిన వైద్యులు
  • చికిత్స విజయం అయిందని వైట్ హౌజ్ ప్రకటన
Advertisement
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్మ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఛాతి దగ్గర ఉన్న చివరి కణతిని కూడా వైద్యులు తొలగించారు. దాంతో, ఆయన క్యాన్సర్ చికిత్స విజయవంతంగా పూర్తయిందని వైట్ హౌజ్ వైద్యుడు కెవిన్ ఓకానర్ ప్రకటించారు. బైడెన్ చర్మంపై ఉన్న క్యాన్సర్ కణజాలం మొత్తాన్ని విజయవంతంగా తొలగించినట్టు తెలిపారు. బైడెన్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఇకపై క్యాన్సర్ ట్రీట్ మెంట్ అవసరం లేదని ప్రకటించారు. కాగా, 80 ఏళ్ల  బైడెన్ కు గత నెలలో వైట్ హౌజ్ వైద్య బృందం పూర్తి శారీరక పరీక్షలు నిర్వహించింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, విధులు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించింది.
Advertisement
Advertisement
USA
Joe Biden
cancer

More Telugu News