తిరుమల నడకదారి భక్తులకు శుభవార్త.. త్వరలో దివ్యదర్శనం టోకెన్ల జారీ
- అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు
- రెడీ అవుతున్న సాఫ్ట్‌వేర్
- శ్రీవాణి దర్శన టికెట్లు ఉన్న భక్తులకు ఎస్ఎన్‌జీహెచ్, ఏటీజీహెచ్ అతిథి గృహాల్లో గదుల కేటాయింపు
శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులకు తిరుమలలోని ఎస్ఎన్‌జీహెచ్, ఏటీజీహెచ్ అతిథి గృహాల్లో 88 గదులు కేటాయించినట్టు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో తిరుమలకు 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5న జరిగే శ్రీసీతారాముల కల్యాణంలో ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు.