మా బెడ్ రూమ్ లోకి వచ్చేయండి.. ఫొటోగ్రాఫర్లపై సైఫ్ అలీఖాన్ గుస్సా.. వీడియో వైరల్!
- మలైకా అరోరా తల్లి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన సైఫ్, కరీనా
- పార్టీ తర్వాత ఇంట్లోకి వెళ్తుండగా వెంటపడిన ఫొటోగ్రాఫర్లు
- ‘ఒక పని చేయండి.. మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండి’ అంటూ సైఫ్ అసహనం
అయితే వారిని పట్టించుకోకుండా సైఫ్, కరీనా ముందుకు వెళ్లారు. ఫొటో అంటూ మళ్లీ అడగడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సైఫ్.. ‘‘ఒక పని చేయండి.. మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండి’’ అని అన్నారు. సీరియస్ గా ఇంట్లోకి వెళ్తూ డోర్ క్లోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇటీవల విక్రమ్ వేద సినిమాతో సైఫ్ అలీఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో హృతిక్ రోషన్ కూడా ఇంకో హీరోగా కనిపించారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ రూపొందించిన ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా సైఫ్ నటించారు. ఈ ఏడాదే సినిమా రిలీజ్ కానుంది.