Pawan Kalyan: కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లకు క్షమాపణ చెప్పిన పవన్ కల్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. షెడ్యూల్ ప్రకారం తన సినిమాలను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన ఇతర సినిమా ఫంక్షన్లకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లకు జనసేనాని క్షమాపణలు చెప్పారు. వారిద్దరూ కలిసి నటించిన 'కబ్జా' సినిమా ఈవెంట్ కు హాజరుకాలేకపోవడమే దీనికి కారణం.  

తనను 'కబ్జా' ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానించినందుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే, రాజకీయపరంగా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల ఈవెంట్ కు హాజరుకాలేకపోతున్నానని, చాలా బాధపడుతున్నానని చెప్పారు. ఉపేంద్ర, సుదీప్ కు తన ప్రత్యేక శుభాకాంక్షలు అని అన్నారు. ఇద్దరూ వెరైటీ పాత్రలను పోషిస్తూ వివిధ భాషల్లో గుర్తింపును పొందారని చెప్పారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ చిత్ర టీమ్ కు శుభాకాంక్షలు అని చెప్పారు.
Pawan Kalyan
Janasena
Upendra
Sudeep
Tollywood

More Telugu News