సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు
- నేడు ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చిన సీపీఐ
- నంద్యాలలో ఓ కార్యక్రమానికి హాజరైన రామకృష్ణ అరెస్ట్
- ఉమ్మడి కర్నూలు సీపీఐ నేతల హౌస్ అరెస్ట్
దీంతో అప్రమత్తమైన పోలీసులు రామకృష్ణను అరెస్ట్ చేయడంతోపాటు ఆ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రామకృష్ణ బయటకు రాగానే అప్పటికే అక్కడ కాపుకాసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 9 మంది నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించగా, రామకృష్ణను సూరజ్ హోటల్‌కు తరలించి నిర్బంధించారు.