కేటీఆర్ కు ట్విట్టర్ టిల్లు అని పేరు పెడితే బాగుంటుంది: బండి సంజయ్
- రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలేనన్న బండి సంజయ్
- బీజేపీ మద్దతివ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్య
- ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శ
మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని బండి సంజయ్ విమర్శించారు. ప్రతి కుటుంబంపై రూ. 6 లక్షల అప్పు మోపారని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు మద్యం ప్రధాన కారణమని... మద్యం వాడకాన్ని నియంత్రించాల్సి ఉందని అన్నారు. ఒక కార్పొరేటర్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడంటూ తనపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నాడని... ఆయనకు ట్విట్టర్ టిల్లు అని పేరు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.