ఇప్పుడు రోబోల మీద పడిన గూగుల్.. వాటికి కూడా లే ఆఫ్!
- ‘ఎవ్రీ డే రోబోట్స్’ ప్రాజెక్టును మూసేసిన గూగుల్
- వివిధ ప్రాజెక్టులపై పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులు ఔట్
- ఈ ఏడాది మొదట్లో 1200 మంది ఉద్యోగులకు ఉద్వాసన
ఎవ్రీ డే రోబోట్స్ ప్రాజెక్టులో 200 మందికిపైగా ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. కాగా, ఈ రోబోలు ఫలహారశాలల్లోని చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయడం, తలుపులు తెరవడంతోపాటు ఇతర పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. కరోనా సమయంలో ఇవి విశేష సేవలు అందించాయి. కాన్ఫరెన్స్ రూముల్లోని టేబుళ్ల పరిశుభ్రతను పరీక్షించేందుకు కూడా వీటిని ఉపయోగించేవారు. అయితే, ఇప్పుడీ ‘ఎవ్రీ డే రోబోట్స్’ ప్రాజెక్టు లాభదాయకం కాదని భావించిన ఆల్ఫాబెట్ దానిని మూసివేసింది. కాగా, ఈ ఏడాది మొదట్లో 1200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు.