నా దేవుడు నాగబాబు .. మా ఇంట్లో ఆయన ఫొటో పెట్టుకున్నాను: 'జబర్దస్త్' పంచ్ ప్రసాద్!

  • 'పంచ్' ప్రసాద్ చదువు అందుకే ఆగిపోయిందట
  • 'మెస్'లో పనిచేసేవాడినని చెప్పిన ప్రసాద్ 
  • 'జబర్దస్త్'కి రావడానికి కారకుడు షకలక శంకర్ అని వెల్లడి
  • తన అనారోగ్యం గురించిన వివరణ  

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో 'పంచ్' ప్రసాద్ ఒకరు. అయితే కొంతకాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాగే ఆర్ధిక పరమైన ఇబ్బందులతోను సతమతమవుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో 'పంచ్' ప్రసాద్ మాట్లాడుతూ తన గురించిన విషయాలను ప్రస్తావించాడు. 

"మాది భీమవరం .. నా చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయాడు .. ఆ తరువాత అక్క చనిపోయింది. మా అమ్మకు నేనే ఆధారం. అందువలన 10వ తరగతితో చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ఒక మెస్ లో సప్లైయర్ గా పనిచేస్తూ ఉండేవాడిని. షకలక శంకర్ ద్వారా 'జబర్దస్త్' కి వెళ్లాను. అక్కడ నాకు మంచి గుర్తింపు వచ్చింది" అన్నాడు. 

"నేను అనారోగ్యం బారిన పడగానే ఆర్పీ స్పందించాడు. ఇప్పటికీ నాకు తన సహాయ సహకారాలు అందిస్తూనే వస్తున్నాడు. ఇక నా పరిస్థితి తెలియగానే నాగబాబుగారు వెంటనే ఆదుకున్నారు. ఆయన నా దేవుడు .. మా ఇంట్లో ఆయన ఫొటో పెట్టుకున్నాను. నూకరాజుతో పాటు 'జబర్దస్త్'లోని వాళ్లంతా హెల్ప్ చేస్తూనే ఉన్నారు" అంటూ చెప్పుకొచ్చాడు. 



More Telugu News

Nagababu Punch Prasad Shakalaka Shankar