ram charan: ఆ విషయాన్ని ముందు ఎన్టీఆర్ తోనే పంచుకున్నా: రామ్ చరణ్

ram charan first shared the good news to ntr
షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ స్నేహం మరింత బలపడింది. తాజాగా అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఎన్టీఆర్ తో ఉన్న స్నేహబంధాన్ని మరోసారి బయటపెట్టారు రామ్ చరణ్. 

తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించడానికన్నా ముందు.. ఎన్టీఆర్ కి ఫోన్ చేసి చెప్పానని రామ్ చరణ్ తెలిపారు. తారక్, తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని, అన్ని విషయాల గురించి తాము మాట్లాడుకుంటామని చెప్పారు. మెగా కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నందుకు తన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని అన్నారు. 

రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడాయనకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ కు ప్రజెంటర్ గా చరణ్ వ్యవహరించనున్నారు. రేపు జరగనున్న ఈ వేడుకలో ఒక విజేతకు రామ్ చరణ్ చేతుల మీదుగా అవార్డు అందజేయనున్నారు. మరోవైపు ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ కార్యక్రమంలోనూ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
ram charan
Junior NTR
RRR
USA
HCA

More Telugu News