సిరిమానుపై వేలాడుతూ గాల్లో తిరిగిన ఎమ్మెల్యే తిప్పేస్వామి
- హేమావతి గ్రామంలో హెంజేరు సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
- నాలుగో రోజైన నేడు ఘనంగా సిరిమానోత్సవం
- సిరిమానుకు పూజలు చేసి కోరికలు నెరవేరాలంటూ సిరిమానుపై గాల్లో తిరిగిన ఎమ్మెల్యే
సిరిమానుపై వేలాడుతూ గాల్లో తిరిగితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో సిరిమానోత్సవానికి హాజరైన తిప్పేస్వామి సిరిమానుకు పూజలు నిర్వహించారు. అనంతరం సిరిమానుకు కట్టిన తాడును పట్టుకుని గాల్లో చుట్టూ తిరిగారు.