వరుసగా రెండోరోజూ తగ్గిన బంగారం ధర
- వారంలో ఏకంగా ఆరుసార్లు తగ్గిన ధర
- 10 గ్రాముల బంగారంపై రూ.120 తగ్గుదల
- స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర
ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,150 ఉండగా, 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.56,880 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,730 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.57,550 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,050, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,780గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,730 ఉంది. కాగా, వెండి ధరల్లో మాత్రం మార్పు లేదు. ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ. 68,500కాగా, బెంగళూరు, చెన్నైలో రూ.71,700 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 71,700 వద్ద కొనసాగుతోంది.