మరో ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య

Father commits suicide after wife gives birth to another girl child
  • మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని తండ్రి మనస్తాపం
  • ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య
  • రాజేంద్రనగర్‌లో వెలుగు చూసిన ఘటన
మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. అత్తాపూర్ ఔట్‌పోస్ట్ ఎస్సై కిషన్‌జీ తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్(35)కు ఇద్దరు ఆడపిల్లలు. అతడు ఓ ఫర్నీచర్‌ షాప్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

పదిహేను రోజుల క్రితం అహ్మద్ భార్య కాన్పు కోసం కర్ణాటకలోని తన పుట్టింటికి వెళ్లింది. మరోమారు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో.. మనస్తాపానికి గురైన అహ్మద్ కొన్ని రోజులుగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Ranga Reddy District

More Telugu News