హైదరాబాదులో తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం

  • గత నెలలో తారకరత్నకు తీవ్ర గుండెపోటు
  • బెంగళూరులో మూడు వారాల పాటు చికిత్స
  • పరిస్థితి విషమించి కన్నుమూసిన తారకరత్న
  • నేడు మహాప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు
హైదరాబాదులో సినీ నటుడు తారకరత్న అంతిమయాత్ర ప్రారంభమైంది. ఫిలించాంబర్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. తారకరత్న అంతిమయాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతిమయాత్ర సందర్భంగా తారకరత్న పిల్లలు విలపించడం అందరినీ కలచివేసింది. కాగా, తారకరత్నకు కుమారుడు తనయ్ రామ్ అంత్యక్రియలు నిర్వహించనున్నాడు. 

రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలోని నివాసం నుంచి ఈ ఉదయం తారకరత్న భౌతికకాయాన్ని ఫిలించాంబర్ కు తరలించడం తెలిసిందే. అభిమానులు భారీగా తరలివచ్చి తారకరత్నకు నివాళులు అర్పించారు.

Tarakaratna
Funeral
Hyderabad
Tollywood
TDP

More Telugu News