పుజారాకు వందో టెస్టు కానుక.. నాలుగోసారి రంజీ ట్రోఫీ నెగ్గిన సౌరాష్ట్ర
- ఫైనల్లో బెంగాల్ పై 9 వికెట్ల తేడాతో గెలుపు
- చెలరేగిన సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్
- అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
కెప్టెన్ మనోజ్ తివారి (68), అనుస్తుప్ మజుందార్ (61) మాత్రమే రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనాద్కట్ ఆరు, చేతన్ సకారియా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 14 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 2.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి రంజీ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఉనాద్కట్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. వందో టెస్టు ఆడుతున్న తమ రాష్ట్ర దిగ్గజ ఆటగాడు పుజారాకు రంజీ ట్రోఫీ నెగ్గి కానుక ఇస్తామని ఫైనల్ కు ముందు చెప్పిన ఉనాద్కట్ మాట నిలబెట్టుకున్నాడు. ఇది వరకు1936–37, 1943–44, 2019–20 సీజన్లలోనూ సౌరాష్ట్ర రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది.