Akshay Kumar: చిరుతపులిను ఢీకొట్టి గాయపడిన అక్షయ్ కుమార్ మేకప్ మ్యాన్

  • ముంబయి శివార్లలో ఘటన
  • షూటింగ్ లొకేషన్ కు స్నేహితుడ్ని డ్రాప్ చేసేందుకు వచ్చిన మేకప్ మ్యాన్
  • పందిని తరుముతూ రోడ్డుపైకి వచ్చిన చిరుత
  • బైక్ ను నియంత్రించలేకపోయిన మేకప్ మ్యాన్
Akshay Kumar makeup man injured after collided with leopard

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మేకప్ మ్యాన్ శ్రవణ్ విశ్వకర్మ చిరుతపులిని బైక్ తో ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డాడు. ముంబయి శివార్లలో 'బడే మియా చోటే మియా' సినిమా సెట్స్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం అతడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను ఎలా గాయపడిందీ మీడియాకు వివరించాడు. 

తన స్నేహితుడ్ని షూటింగ్ లొకేషన్ లో డ్రాప్ చేసేందుకు శ్రవణ్ ఓ బైక్ పై వచ్చాడు. సెట్స్ కు కొద్ది దూరంలో ఓ పంది రోడ్డుకు అడ్డంగా వచ్చింది. ఆ పందిని తరముకుంటూ ఓ చిరుత కూడా దూసుకుని వచ్చింది. ఈ క్రమంలో, శ్రవణ్ నడుపుతున్న బైక్ అదుపుతప్పి చిరుతను ఢీకొట్టింది. 

దాంతో శ్రవణ్ కిందపడిపోగా, ఆ చిరుత అతడి చుట్టూ తిరిగింది. శ్రవణ్ కు అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత స్పృహకోల్పోయాడు. అక్కడివారు అతడిని గమనించి ఆసుపత్రికి తరలించారు.

More Telugu News