మార్చి 31 నుంచి ఐపీఎల్... మళ్లీ పాత పద్ధతిలోనే పోటీలు!
- ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్ విడుదల
- 52 రోజుల పాటు లీగ్ దశ పోటీలు
- ప్లే ఆఫ్ షెడ్యూల్ త్వరలో విడుదల
- మే 28న ఫైనల్
- ఈసారి ఇంటా, బయటా పద్ధతిలో మ్యాచ్ లు
లీగ్ దశలో మొత్తం 52 రోజుల పాటు 70 మ్యాచ్ లు జరుగుతాయి. 12 వేదికల్లో ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తారు.
కరోనా సంక్షోభం కారణంగా గత సీజన్ లో కొన్ని నగరాల్లోనే మ్యాచ్ లు నిర్వహించడం తెలిసిందే. కరోనా వ్యాప్తి తగ్గిపోవడంతో ఈసారి మునుపటి తరహాలోనే ఇంటా, బయట విధానంలో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. దాంతో ఆయా జట్లు సొంతగడ్డ ప్రయోజనాన్ని పొందే వీలుంటుంది.
