నారా లోకేశ్ పాదయాత్ర.. నేటి షెడ్యూల్!

Nara Lokesh 21st day padayatra schedule
  • 21వ రోజుకు చేరుకున్న యువగళం పాదయాత్ర
  • ఉదయం రాయపేడు విడిది కేంద్రం నుంచి యాత్ర ప్రారంభం
  • ప్రస్తుతం సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతున్న యాత్ర
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ ఉదయం రాయపేడు విడిది కేంద్రం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమయింది. యువతీయువకులతో ముఖాముఖి సమావేశం అనంతరం పాదయాత్ర ప్రారంభమయింది. ఇప్పటి వరకు 261 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. నిన్న 16.6 కిలోమీటర్ల మేర లోకేశ్ నడిచారు. 

ఈనాటి (16.2.2003) లోకేశ్ పాదయాత్ర షెడ్యూల్:
  • ఉదయం 8 గంటలకు రాయపేడు విడిది కేంద్రంలో యువతీయువకులతో ముఖాముఖి సమావేశం. అనంతరం పాదయాత్ర ప్రారంభం.
  • 10 గంటలకు కేవీబీ పురం జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
  • మధ్యాహ్నం 12.10 గంటలకు రాజుల కండ్రిగలో స్థానికులతో మాటామంతీ.
  • 2 గంటలకు రాగిగుంటలో భోజన విరామం. 
  • సాయంత్రం 3 గంటలకు తిమ్మనాయుడుగుంటలో ముత్తరాసి సామాజికవర్గీయులతో సమావేశం.
  • 6.20 గంటలకు తిమ్మసముద్రంలో ఎస్టీ సామాజికవర్గీయులతో సమావేశం.
  • 7.45 గంటలకు బైరేజి కండ్రిగ విడిది కేంద్రంలో బస.
Go Back to Shorts
Nara Lokesh
Yuva Galam Padayatra
Schedule

More Telugu News