గర్భవతి అయ్యిందనే వార్తలపై సింగర్ సునీత స్పందన

  • రెండేళ్ల క్రితం రామకృష్ణను రెండో వివాహం చేసుకున్న సునీత
  • సునీత ప్రెగ్నెంట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం
  • నేను గర్భవతి అనే విషయం నాకే తెలియదే అన్న సునీత
టాలీవుడ్ లో సింగర్ సునీతది ఒక ప్రత్యేకమైన స్థానం. మధురమైన స్వరమే కాకుండా, అందరినీ ఆకర్షించే అందం ఆమె సొంతం. ఎన్నో వందల పాటలను పాడిన సునీత... పలువురు హీరోయిన్ లకు డబ్బింగ్ కూడా చెపుతోంది. రెండేళ్ల క్రితం వ్యాపారవేత్త, మ్యాంగో మ్యూజిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకుంది. 42 ఏళ్ల వయసులో ఆమె రెండో పెళ్లి చేసుకోవడం అప్పట్లో సెన్సేషనల్ అయింది.

ఈ క్రమంలో తాజాగా ఆమె గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. సునీత మళ్లీ గర్భవతి అయింది అనేదే ఆ వార్త. ఈ వార్తపై సునీత స్పందిస్తూ... 'ఔనా.. నేను ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలియదే' అని సరదాగా వ్యాఖ్యానించింది. ఈ వార్త తనకు గానీ, తన జీవితానికి కానీ సంబంధించినది కాదని తెలిపింది. ఇలాంటి రూమర్లను సృష్టించిన వారి ఆలోచన స్థాయికి చెందినదని విమర్శించింది.

Singer Sunitha
Pregnant
Tollywood

More Telugu News