'సార్' సెట్లో ధనుశ్ ఎలా ఉండేవారంటే ..!

Sir Movie Update
  • ధనుశ్ హీరోగా రూపొందిన 'సార్'
  • స్టూడెంట్స్ గా చాలామంది నటించిన సినిమా ఇది
  • ధనుశ్ నటన పట్ల వారంతా ఆశ్చర్యం
  • ఆయన చాలా సింపుల్ అని వెల్లడి
  • ఈ నెల 17వ తేదీన విడుదల   
ధనుశ్ హీరోగా వెంకీ అట్లూరి 'సార్' సినిమాను రూపొందించాడు. సూర్య దేవర నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విద్యా వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించిన ఒక పెద్ద మనిషిపై ఒక లెక్చరర్ సాగించిన పోరాటమే ఈ సినిమా. 1990లలో కాలేజ్ నేపథ్యంలో నడిచే ఈ కథలో చాలామంది స్టూడెంట్స్ గా నటించారు. 

ముఖ్యమైన స్టూడెంట్స్ గా కనిపించే భవ్య .. రూప .. స్పైసీ .. లిఖిత్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ధనుశ్ గారితో కలిసి 53 రోజుల పాటు ట్రావెల్ అయ్యే అవకాశం మాకు ఈ సినిమా వలన లభించింది. ధనుశ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉండేవారు. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఎంత సమయం దొరికినా ఆయన కారవాన్ కి మాత్రం వెళ్లరు. చెట్టు కిందే కూర్చుని బుక్స్ చదువుతూ ఉంటారు. ఏ సీన్ అయినా ఆయన సింగిల్ టేక్ లో చేయడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించేది" అంటూ చెప్పుకొచ్చారు. 

"ఈ సినిమా టీమ్ లో ఎవరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. చాలా సరదాగా ఈ సినిమాను మేము పూర్తి చేశాము. మా షాట్ వచ్చేవరకూ కబుర్లు చెప్పుకోవడం చేసేవాళ్లం. ఒక పిక్ నిక్ కి వెళితే ఎంతలా ఎంజాయ్ చేస్తామో .. అంతలా ఎంజాయ్ చేశాము. తమిళ డైలాగుల విషయంలోను మమ్మల్ని టెన్షన్ పెట్టలేదు. మేము నేర్చుకోవడానికి కావలసినంత సమయం ఇచ్చారు" అన్నారు. 

Go Back to Shorts
Dhanush
Samyuktha Menon
Sir Movie

More Telugu News