మరో ముహూర్తం ఖరారు.. అంబేద్కర్ జయంతి రోజే తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం!
- ఏప్రిల్ 14న ప్రారంభించాలని నిర్ణయం
- ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం, ఝార్ఖండ్ సీఎం, అంబేద్కర్ మనవడు
- బహిరంగ సభపై లేని స్పష్టత
ప్రారంభోత్సవానికి హేమాహేమీలు
సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జేడీయూ నేత అలన్‌సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్లను ప్రభుత్వం ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కాగా, ఇదివరకటి ప్రణాళిక ప్రకారం సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ముహూర్తం మారిన నేపథ్యంలో ఈ సభ ఉంటుందా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేదు.