హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల దగ్ధం.. కుట్ర కోణంపై అనుమానాలు!

Three travel buses caught fire in Hyderabad
  • కూకట్ పల్లిలో పార్క్ చేసిన మూడు బస్సులకు నిప్పు
  • పక్కనే ఉన్న 4 బస్సులను అక్కడి నుంచి తీసుకెళ్లిన సిబ్బంది
  • బస్సులకు నిప్పు ఎలా అంటుకుందన్న దానిపై అనుమానాలు
హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన మూడు బస్సులు దగ్ధమవడం సంచలనం సృష్టించింది. కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద పార్క్ చేసిన భారతీ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సులు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రాంతంలో రోజూ భారతీ ట్రావెల్స్‌కు చెందిన పలు బస్సులను పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే నేడు వాటిలో మూడు బస్సులకు నిప్పంటుకుంది. అప్రమత్తం అయిన ట్రావెల్స్ సిబ్బంది వెంటనే పక్కనే ఉన్న మరో నాలుగు బస్సులను అక్కడి నుంచి తీసుకెళ్లారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదవశాత్తు బస్సులకు మంటలు అంటుకున్నాయా? లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
travel
buses
fire
kukatpally

More Telugu News