Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో గంజాయి కలకలం

విశాఖలో ఉన్నత విద్యలకు నిలయమైన ఆంధ్రా యూనివర్సిటీలో గంజాయి కలకలం రేగింది. వర్సిటీ సెక్యూరిటీ గార్డులే గంజాయి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ దాడుల్లో పోలీసులు రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందాలో ఏయూ భద్రతా అధికారి కారు డ్రైవర్ సూత్రధారి అని భావిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు చేపట్టారు. విశాఖ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

గత శుక్రవారం రాత్రి గంజాయి ఉందన్న సమాచారంతో బీచ్ రోడ్డులో ఉన్న యోగా విలేజ్ లో ఆగివున్న ఓ ఆటోలో సోదాలు చేశారు. చిన్న పొట్లాల్లో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
Andhra University
Ganja
poli
Vizag

More Telugu News