'దసరా' నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
- నాని హీరోగా రూపొందిన 'దసరా'
- రెండోసారి ఆయన జోడీకట్టిన కీర్తి సురేశ్
- సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణ్
- మార్చి 30వ తేదీన సినిమా రిలీజ్
నాని పక్కా మాస్ లుక్ తో కనిపిస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన రెండో సినిమా ఇది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. 'ఓరి వారి నీదు గాదుర పోరి .. ఇడిసెయ్ రా ఇంగ .. ఒడిసెను దారి' అంటూ ఈ పాట సాగుతోంది.
ఈ సినిమాలో హీరో స్లాంగ్ కి తగినట్టుగానే సాహిత్యం .. ఆలాపన ఉన్నాయి. ఈ నెల 13వ తేదీన పూర్తి పాటను వదలనున్నారు. సముద్రఖని .. సాయికుమార్ .. దీక్షిత్ శెట్టి ముఖ్యమైన పాత్రలను పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, మార్చి 30వ తేదీన వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.