సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై మళ్లీ రాళ్ల దాడి
- ఇప్పటికే రెండు పర్యాయాలు రాళ్ల దాడి
- తాజాగా మూడోసారి రాళ్ల దాడి
- మహబూబాబాద్-గార్ల స్టేషన్ల మధ్య ఘటన
- ఓ బోగీ అద్దం ధ్వంసం
- దర్యాప్తు చేస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
తాజాగా, ఈ రైలుపై మూడోసారి రాళ్ల దాడి జరిగింది. మహబూబాబాద్-గార్ల స్టేషన్ల మధ్య నేడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. దాంతో ఓ బోగీ (సీ-8 కోచ్) అద్దం ధ్వంసమైంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకునేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగింది.