ప్రపంచంలోనే అత్యంత పాపాత్ముడు కేసీఆర్: సినీ నటి కవిత

Actress Kavitha fires on KCR
  • రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మాత్రమే సంతోషంగా ఉన్నారన్న కవిత
  • రైతులు, ఉద్యోగులు, కూలీలు ఎవరూ సంతోషంగా లేరని వ్యాఖ్య
  • బతుకమ్మ పేరుతో కల్వకుంట్ల కవిత రాజకీయాలు చేస్తోందని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీనియర్ సినీ నటి, బీజేపీ నాయకురాలు కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద పాపాత్ముడు ఎవరైనా ఉన్నారంటే అతను కేసీఆరేనని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మినహా ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. రైతులు, ఉద్యోగులు, టీచర్లు, కౌలు రైతులు, కూలీలు ఎవరికీ సంతోషం లేదని అన్నారు. బతుకమ్మ పేరుతో కేసీఆర్ కూతురు కవిత రాజకీయాలు చేస్తున్నారని... రూ. 3 కోట్లతో చీరలు కొని పంపిణీ చేస్తున్నారని... అది ఎవరి డబ్బు? అని ప్రశ్నించారు. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం రాంపూర్ లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Kavitha
BRS
BJP
KCR

More Telugu News