ఎన్టీఆర్ సినిమా కోసం అటు సైఫ్ అలీఖాన్ .. ఇటు చియాన్ విక్రమ్!

Ntr and koratala movie update
ఎన్టీఆర్ 30వ సినిమాకి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. నిన్నమొన్నటివరకూ స్క్రిప్ట్ పై కొరటాల జరుపుతూ వచ్చిన మార్పులకు ఫుల్ స్టాప్ పెట్టేసి లాక్ చేసేశారు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందనీ, వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

'ఆర్ ఆర్ ఆర్'తో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా స్థాయి క్రేజ్ రావడంతో, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మించనున్నారు. ఈ సినిమాలో కథనాయికగా జాన్వీ కపూర్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయిగానీ, అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. 

ఇక సముద్రం నేపథ్యంలో జరిగే ఈ కథలో రెండు కీలకమైన పాత్రలు ఉన్నాయనీ, ఒక పాత్రకి గాను సైఫ్ అలీఖాన్ ను .. మరో పాత్రకి గాను చియాన్ విక్రమ్ ను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. కల్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమాలో, ఇంకా ఏయే విశేషాలు చోటుచేసుకుంటాయనేది చూడాలి.   

Go Back to Shorts
Ntr
Janhvi Kapoor
Vikram
Saif Ali khan

More Telugu News