Amitabh Bachchan: ఆరోజు నా ప్యాంటులో ఎలుక దూరింది.. ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టిన బిగ్ బీ

amitabh bachchan shares funny incident on social media over do aur do panch movie
షార్ట్స్‌లో చూడండి
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ‘దో ఔర్ దో పాంచ్’ సినిమా విడుదలై 43 ఏళ్లవుతున్న సందర్భంగా ఆయన తాజాగా ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర ఘటన గురించి షేర్ చేశారు. అప్పట్లో తాను బెల్‌బాటమ్ ప్యాంటు ధరించిన సందర్భంలో ప్యాంటులోకి ఓ ఎలుక దూరిందని చెప్పుకొచ్చారు. ‘‘2 2=5; దో ఔర్ దో పాంచ్ సినిమా వచ్చి 43 ఏళ్లయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా సాగిందో..! ఆ బెల్ బాటమ్ ప్యాంట్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ప్యాంటు వేసుకుని సినిమా చూడటానికి వెళ్లాను. అయితే..సీట్లో కూర్చున్న కాసేపటికే నా ప్యాంటులో ఓ ఎలుక దూరింది’’ అంటూ నాటి సరదా ఘటన గురించి బిగ్ బీ చెప్పుకొచ్చారు. నవ్వుతున్న ఓ ఎమోజీని కూడా జతచేశారు. 

ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వచ్చింది. అమితాబ్ బచ్చన్ బెల్‌బాటమ్ లుక్స్‌ను గుర్తు చేసుకున్న నెటిజన్లు ఆ రోజుల్లో ఆయన స్టైల్ వేరే లెవెల్‌‌లో ఉండేదంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ‘‘నాటి నుంచీ నేటి దాకా మీలో ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదు’’ అంటూ మరికొందరు బిగ్‌ బీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

ఇక 1980లో విడుదలైన ఈ చిత్రంలో హేమమాలిని, ఖదీర్ ఖాన్, ఓం ప్రకాశ్, శ్రీరామ్ లగూ తదితరులు నటించారు. ఈ మూవీకి రాకేశ్ కుమార్ దర్శకత్వం వహించగా సాండో ఎమ్ఎమ్ఏ చిన్నప్ప తేవర్ నిర్మించారు. కళారంగానికి బిగ్ బీ చేసిన సేవకు గాను భారత ప్రభుత్వం ఆయనను 2015లో పద్మ విభూషణ్‌తో సత్కరించిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Amitabh Bachchan

More Telugu News