పౌలా హర్డ్ తో డేటింగ్ చేస్తున్న బిల్ గేట్స్
- 60 ఏళ్ల పౌలాతో బిల్ గేట్స్ ప్రేమాయణం
- ఏడాదికి పైగా డేటింగ్ లో ఉన్న జంట
- 2019లో పౌలా హర్డ్ భర్త మృతి
2019లో పౌలా హర్డ్ భర్త మార్క్ హర్డ్ మరణించారు. క్యాన్సర్ తో చాలా కాలం పోరాడిన తర్వాత ఆయన మృతి చెందారు. పౌలా హర్డ్ టెక్ ఎగ్జిక్యూటివ్ గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఈవెంట్ ప్లానర్ గా పని చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటున్నారు. మరోవైపు బిల్ గేట్స్, మిలిందా గేట్స్ 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 30 ఏళ్ల వైవాహిక జీవితానికి వారు ముగింపు పలికారు.