ఢిల్లీ మద్యం కేసులో సంచలనం.. ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్
- ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ దూకుడు
- గత రాత్రి ఢిల్లీలో బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ
- అరెస్ట్ చేసినట్టు ఈ ఉదయం ప్రకటన
- మరికాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరచనున్న సీబీఐ అధికారులు
అరెస్టుకు ముందు గత రాత్రి ఢిల్లీలో బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. ఆయనను అరెస్ట్ చేసినట్టు ఈ ఉదయం ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టులో బుచ్చిబాబును హాజరుపరచనున్నారు.