వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విమానాల తయారీ సంస్థ బోయింగ్
- లేఆఫ్ లు ప్రకటిస్తున్న దిగ్గజ సంస్థలు
- అదే బాటలో బోయింగ్
- 2 వేల మందికి ఉద్వాసన పలికేందుకు నిర్ణయం
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై మక్కువ
ముఖ్యంగా, మానవ వనరుల విభాగం, ఫైనాన్స్ విభాగంలోని ఉద్యోగులపై వేటు వేయాలని బోయింగ్ నిశ్చయించుకుంది. మూడింట ఒక వంతు ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ కు ఇవ్వాలనేది బోయింగ్ నిర్ణయంగా తెలుస్తోంది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.
అయితే, ఇంజినీరింగ్, మాన్యుఫాక్చరింగ్ విభాగాల్లో ఈ ఏడాది భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్టు బోయింగ్ వర్గాలు వెల్లడించాయి. బోయింగ్ నిర్ణయం చూస్తుంటే, కేవలం హెచ్ఆర్, ఫైనాన్స్ విభాగాల్లోనే ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అర్థమవుతోంది.