మీకు అంతగా నచ్చితే విశాఖకు వీకెండ్ వెళ్లండి: రఘురామకృష్ణ రాజు
- త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానంటూ సీఎం ప్రకటన
- సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందన్న వైసీపీ నేతలు
- జగనన్న విశాఖ వాసంపై రాష్ట్రమంతా చర్చ నడుస్తోందన్న రఘురామ
- రాజు ఎక్కడుంటే అదే రాజధాని కాదని వెల్లడి
సీఎం మాట్లాడిన రెండ్రోజులకే ఆయన తమ్ముడిని సీబీఐ ప్రశ్నించిందని అన్నారు. రేపో మాపో మరికొందరికి సీబీఐ నోటీసులు అందే అవకాశం ఉందని తెలిపారు. వివేకా హత్య కేసు నుంచి దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు.
ఇక, కోర్టు తీర్పు వచ్చే వరకు రాజధానిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. మీకు అంతగా నచ్చితే విశాఖకు వీకెండ్ వెళ్లండి అంటూ జగన్ కు సలహా ఇచ్చారు.