కోటంరెడ్డి భద్రత 1 ప్లస్ 1 కు తగ్గింపు
- ఇటీవల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న కోటంరెడ్డి
- సొంత పార్టీ వైపే వేలెత్తిచూపుతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
- ఇప్పటివరకు కోటంరెడ్డికి 2 ప్లస్ 2 భద్రత
- భద్రత తగ్గింపునకు సమ్మతించిన కోటంరెడ్డి!
తన ఫోన్ ను సొంత పార్టీయే ట్యాపింగ్ చేస్తోందంటూ కోటంరెడ్డి ఇటీవల వరుసగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి తీవ్ర సంచలనం సృష్టించారు. పార్టీ పెద్దలు రంగప్రవేశం చేసినా కోటంరెడ్డి తన ఆరోపణలకు తెరదించలేదు సరికదా, ఆధారాలు ఇవిగోనంటూ మరో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో, పార్టీకి ఆయనకు మధ్య సంబంధం దాదాపు తెగిపోయింది.