మరికాసేపట్లో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రెస్‌మీట్
- ఉదయం 10 గంటలకు కోటంరెడ్డి మీడియా సమావేశం
- ఏం మాట్లాడతారన్న విషయంలో ఉత్కంఠ
- రెండు రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు బయటపెట్టిన నేత
అధికార వైసీపీలో కలకలం రేపిన కోటంరెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ తదితర నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఆయన కావాలనే సీఎం జగన్, ఇంటెలిజెన్స్ చీఫ్‌పై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి ఫోన్‌ను ఎవరూ ట్యాప్ చేయలేదని, అది రికార్డింగ్ మాత్రమేనని అన్నారు. ఈ నేపథ్యంలో వారి విమర్శలను కోటంరెడ్డి నేటి మీడియా సమావేశంలో ఆయన తిప్పికొట్టే అవకాశం ఉంది.