పన్నీర్ సెల్వంను కలిసిన జయలలిత మేనకోడలు దీప
- కుమార్తె నామకరణానికి పన్నీర్ సెల్వంను ఆహ్వానించిన దీప
- తాను రాజకీయాల్లోకి రావడం దేవుడి చేతిలో ఉందని వ్యాఖ్య
- పోయెస్ గార్డెన్ లో పనులు పూర్తయిన తర్వాత తాము అక్కడే ఉంటామని వెల్లడి
అన్నాడీఎంకే పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. తన మేనత్త జయలలిత అధికార నివాసం పోయెస్ గార్డెన్ లో మరమ్మతులు జరుగుతున్నాయని... పనులు పూర్తయ్యాక తాము అందులోనే ఉంటామని వెల్లడించారు. కొన్ని నెలల క్రితం దీప ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో తన కూతురు నామకరణానికి దీప దంపతులు కొందరు ప్రముఖులను స్వయంగా కలుస్తూ వారిని వేడుకకు ఆహ్వానిస్తున్నారు.