Pavan Kalyan: నేను పెళ్లే చేసుకోకూడదని అనుకున్నాను..!: 'ఆహా' అన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలయ్యతో పవన్ కల్యాణ్

'ఆహా' ఓటీటీలో అత్యధిక వ్యూయర్ షిప్ తో సాగుతున్న 'అన్ స్టాపబుల్ 2' టాక్ షోలో పవన్ పాల్గొన్న ఫస్టు పార్టును నిన్న రాత్రి స్ట్రీమింగ్ చేశారు. 'పవనేశ్వర .. పవరేశ్వరా' అంటూ పవన్ ను బాలయ్య ప్రశంసించడం .. ఆయన మేనరిజంను ప్రత్యక్షంగా చూడాలని ఉందంటూ పట్టుబట్టడం ఈ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి. మెగా ఫ్యామిలీలో తన తల్లి .. వదిన .. చరణ్ .. సాయితేజ్ .. వైష్ణవ్ తేజ్ గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించాడు. 'ఈ పెళ్లిళ్ల గోల ఏంటి భయ్యా?' అంటూ పవన్ ను బాలయ్య అడిగారు. 

అందుకు పవన్ స్పందిస్తూ .. "జీవితంలో నేను అసలు పెళ్లే చేసుకోకూడదని అనుకున్నాను .. బ్రహ్మచారిగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఏం చేస్తాం  .. అలా జరిగిపోయాయి. రాజకీయాలలో చాలామంది నన్ను ఈ పెళ్లిళ్ల విషయంలోనే టార్గెట్ చేస్తుంటారు. కానీ నేనేమీ ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు .. ఒకేసారి ముగ్గురితో కలిసి ఉండటం లేదే అని చెబుతున్నా వినిపించుకోరు" అని అన్నారు. 

"ఒకరితో నాకు కుదరదని అనుకున్నప్పుడు నేను విడాకులు ఇచ్చేసి చట్టబద్ధంగా మరో పెళ్లి చేసుకున్నాను. అంతే తప్ప వ్యామోహంతో చేసుకోవడం లేదు. నన్ను టార్గెట్ చేయడానికి మరో అంశం లేకపోతే అవతలవారు మాత్రం ఏం చేస్తారు పాపం .. అననీయండి. ఈ విషయంపై ఘాటుగా స్పందించడానికి నాకు నా సంస్కారం .. సభ్యత అడ్డొస్తుంటాయి. అందువలన నా పనిని నేను చేసుకుపోతుంటాను అంతే" అని చెప్పుకొచ్చారు. దాంతో 'ఇకపై పవన్ పెళ్లిళ్ల గురించి ఎవరు మాట్లాడినా .. ' అంటూ బాలయ్య కాస్త ఘాటుగానే ఈ వేదిక ద్వారా హెచ్చరిక చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూను 'ఆహా' ఓటీటీలో చూడచ్చు!  
Pavan Kalyan
Balakrishna
Unstoppable 2

More Telugu News