సూసైడ్ బాంబర్ చెకింగ్ ను ఇలా తప్పించుకున్నాడట..!
- పాకిస్థాన్ మసీదులో పేలుడు ఘటనపై అధికారుల వివరణ
- పోలీసు యూనిఫాంలో వచ్చి ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాది
- యూనిఫాంలో రావడంతో భద్రతా సిబ్బంది సరిగా తనిఖీ చేయలేదని వెల్లడి
మసీదులో కూలిన శిథిలాలను తొలగిస్తుండగా శరీరం నుంచి విడిపోయిన ఒక తలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అది దాడికి పాల్పడిన ఉగ్రవాది తలే అయుంటుందని అనుమానించి, పరిశోధన చేసినట్లు వివరించారు. మసీదు ఆవరణతో పాటు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాక ఉగ్రవాది అతడేనని తేలిందన్నారు. సదరు యువకుడు పోలీసు యూనిఫాంలో మసీదులోకి ప్రవేశించడం ఓ సీసీ టీవీ కెమెరా రికార్డు చేసిందన్నారు. యూనిఫాంతో లోపలికి రావడం వల్లే భద్రతా సిబ్బంది సరిగా చెక్ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు.