హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాలని పార్లమెంట్ ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
- రాజ్యసభలో తీర్మానం ఇచ్చిన ఎంపీ కేశవరావు
- లోక్ సభలో స్పీకర్ కు తీర్మానం అందజేసిన నామా
- అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై చర్చించాలంటున్న ఆప్, కాంగ్రెస్
ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ కేశవరావు ఈ రోజు రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. దేశ ప్రజలు, దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే రీతిలో ఆ నివేదిక ఉన్నట్లు తీర్మానంలో ప్రస్తావించారు. దీనిపై రూల్ 267 కింద చర్చ చేపట్టాలని కోరారు. మరోవైపు లోక్‌సభలోనూ ఇదే అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అదానీ గ్రూపు ఆర్ధిక అవకతవకలపై చర్చించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూడా ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి.