ఆపరేషన్ పేరిట అవయవాలు కాజేసి, పాలిథిన్ కవర్లతో కుట్టేశారు.. ఢిల్లీలో బాలిక మరణానికి కారణమైన డాక్టర్లు

  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ జరుపుతున్న పోలీసులు
  • మృతదేహానికి మంగళవారం పోస్ట్ మార్టం పూర్తి
  • నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె అవయవాలను కాజేశారు. వైద్యుల నిర్వాకంతో తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక మృతదేహానికి మంగళవారం (జనవరి 31న) పోస్ట్ మార్టం నిర్వహించారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం..

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బాలికను తల్లిదండ్రులు జనవరి 21న ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. 24వ తేదీన బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. 26వ తేదీన బాలిక చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. ఆపై అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. బాలిక శరీరానికి పలుచోట్ల ఆపరేషన్ చేసిన గాయాలు, వాటిలో పాలిథిన్ బ్యాగులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. శస్త్రచికిత్స పేరుతో తమ కూతురు అవయవాలను తీసుకున్నారని ఆసుపత్రి యాజమాన్యంపై కేసు పెట్టారు.

జనవరి 31న బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం జరిపించామని, ఆ రిపోర్టు వస్తే బాలిక మరణానికి కారణమేంటనేది తెలుస్తుందని పోలీసులు చెప్పారు. అదేవిధంగా బాలిక తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు నిజమా? కాదా? అనేది కూడా తేలిపోతుందన్నారు. ఆ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.

Girl
delhi
organs
operation
polithin bags
organs theft

More Telugu News