అండర్ 19 మహిళల ప్రపంచకప్ విజేతలకు సచిన్ చేతుల మీదుగా సత్కారం
- రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సత్కారం
- మూడో టీ20 మ్యాచ్ కు ముందు సత్కార కార్యక్రమం
- ప్రపంచకప్ విజేతలను సత్కరించనుండటం సంతోషంగా ఉందన్న జైషా
ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందిస్తూ... భారత్ ను ప్రపంచ విజేతగా నిలిపిన అండర్ 19 మహిళా జట్టు సభ్యులకు సచిన్ టెండూల్కర్, బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ సమక్షంలో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రేపు సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. యువ క్రికెట్లర్లు మన దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు.